అక్కసుతోనే.. | - | Sakshi
Sakshi News home page

అక్కసుతోనే..

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

అక్కసుతోనే.. టెక్కలిలో అరాచకం సీబీఐ దర్యాప్తు చేయాలి.. ●

హామీలు అమలు చేయకుండా విపక్షంపై కక్ష సాధిస్తున్నారు. వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయ డమే అధికార పార్టీ నాయకులు పనిగా పెట్టుకున్నారు. కింజరాపు బుజ్జి, ఎర్రన్నాయుడు మరణం వెనుక ఎవరి పాత్ర ఉందో అందరికీ తెలుసు. అబద్ధాలతో చంద్రబాబు మెప్పు కోసం పాకులాడుకోవడం మానుకోవాలి. వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేసే స్థాయి అచ్చెన్నాయుడుకు లేదు.

– ధర్మాన కృష్ణదాస్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా

అధ్యక్షుడు

టెక్కలిలో అరాచక పాలన సాగుతోంది. తిలక్‌ ను విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు పిలుపించు కుని గంటల తరబడి నిర్భందించడం అన్యాయం. మరణించిన వారిపై లేని పోని విమర్శ లు చేసిన అచ్చెన్నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు బనాయించడమే తప్ప ప్రజల కోసం ఆలోచన చేయడం లేదు. మూలపేట పోర్టు సభ పెద్ద ఎత్తున విజయవంతం కావడంతో అది తట్టుకోలేక ఇలా అక్రమంగా విచారణలు, కేసులతో పోలీసులు వేధిస్తున్నారు.

– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి

వైఎస్సార్‌ మరణంపై అచ్చెన్నాయుడు ఉన్మాది లా మాట్లాడారు. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే దివంగత నేత ఎర్రన్నాయుడు మరణంపై సీబీఐ, సీఐడీ దర్యాప్తులు చేయాలి. ఆనాడు ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న కారులో ఒక్క ఎర్రన్నాయుడు తప్ప మిగిలిన వారంతా ఎలా బతికి బయట పడ్డారు. కేవలం అచ్చెన్నాయు డు ప్లాన్‌ ప్రకారమే జరిగింది. కారులో ఎర్రన్నాయుడుతో ప్రయాణించిన వారిలో చౌదరి బాబ్జికు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి, అప్పలనాయుడుకు ఎంపీ పదవులు కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటి. అక్రమ విచారణలు, కేసులకు భయపడేది లేదు.

– పేరాడ తిలక్‌, వైఎస్సార్‌ సీపీ

టెక్కలి సమన్వయకర్త

Advertisement
 
Advertisement
Advertisement