● జిల్లా కేంద్రంలో డ్రోన్‌ నిఘా | - | Sakshi
Sakshi News home page

● జిల్లా కేంద్రంలో డ్రోన్‌ నిఘా

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

● జిల్లా కేంద్రంలో డ్రోన్‌ నిఘా

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలోని ఒకటి, రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో ఆదివారం పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టారు. అరసవల్లి, ఖాజీపేట, భైరివానిపేట, శాంతినగర్‌ కాలనీ, నాగావళి రివర్‌ వ్యూపార్కు, బలగ, నదీ పరివాహక ప్రాంతాల్లో జల్లెడ వేశారు. బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, ఈవిటీజింగ్‌, చైన్‌స్నాచింగ్‌ అరికట్టడంలో భాగంగానే డ్రోన్‌ ఎగురవేశారు.

పోలీసుల అదుపులో ముగ్గురు..

నగర పరిధిలో ముగ్గురు గంజాయి నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద సుమారు 3 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు, సోమవారం రిమాండ్‌కు తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement