మంత్రి అచ్చెన్నాయుడివి దిగజారుడు వ్యాఖ్యలు | - | Sakshi
Sakshi News home page

మంత్రి అచ్చెన్నాయుడివి దిగజారుడు వ్యాఖ్యలు

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

రణస్థలం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడివి దిగజారుడు వ్యాఖ్యలని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి నాయకులు అడ్డగోలుగా మాట్లాడినా ఎటువంటి చర్యలు ఉండడం లేదన్నారు. అదే వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజల పక్షాన పోరాడేందుకు చిన్న కార్యక్రమం చేసినా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడికి మతిభ్రమించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పిన మావిగన్‌కు ప్రజల మద్దతు వస్తుండడంతో.. డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయనతో పాటు నాలుగు మండలాల నాయకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement