‘దమ్ముంటే రాజీనామా చెయ్‌’ | - | Sakshi
Sakshi News home page

‘దమ్ముంటే రాజీనామా చెయ్‌’

Apr 12 2026 2:42 AM | Updated on Apr 12 2026 2:42 AM

‘దమ్ముంటే రాజీనామా చెయ్‌’

పాతపట్నం: మహానేత మరణంపై, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెప్పు కోసం మంత్రి ఇలా వాఖ్యలు చేయడం దగదని వైఎస్సార్‌సీ పీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతప ట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా ఖండించారు. శనివారం మాజీ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో రెడ్డి శాంతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసం మరణించిన వ్యక్తిపై బురద చల్లడం మంత్రి అచ్చెన్నాయుడికి తగదన్నారు. ఎర్రన్నాయుడు మరణిస్తే గానీ మంత్రి పదవి రాదు అని అచ్చెన్న సహచరుల వద్ద ఎన్నోసార్లు అన్నారని గుర్తు చేశారు. దమ్ముంటే మంత్రి, ఎమ్మెల్యే పదవు లకు అచ్చెన్న రాజీనామా చేసి, పోటీ చేయాలని, డిపాజిట్‌ కూడా రాదని అన్నారు. సమావేశంలో పాతపట్నం, మెళియాపుట్టి పీఏసీఎస్‌ అధ్యక్షులు మిరిబిల్లి శ్యామ్‌సుందరరావు, ఉర్లాన బాలరాజు, పాతపట్నం, మెళియాపుట్టి, ఎల్‌.ఎన్‌.పేట పార్టీ మండల అధ్యక్షులు సవిరిగాన ప్రదీప్‌, పోలాకి జయమునిరావు, పెనుమజ్జి విష్ణుమూర్తి, కొత్తూరు ఎంపీపీ సవర సావిత్రి, రాష్ట్ర బీసీ సెఎల్‌ జాయింట్‌ సెక్రటరీ చింతాడ సూర్యనారాయణ, రాష్ట వాణిజ్య విభాగం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ యరుకోల వెంకటరమణ, రాష్ట్ర ఎస్టీ సెల్‌ జాయింట్‌ సెక్రటరీ రమే ష్‌, రెడ్డి రామారావు, మడ్డు తాతయ్య, వెంకటరమ ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement