హిరమండలం: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం గులుమూరులో ఉపాధి వేతనదారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఉపాధి పథకంలో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నేషన్ యాప్‌తో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, తక్షణమే యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గడంతో వేతనదారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పనికి తగిన వేతనం అస్సలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 200 పని దినాలు కల్పించడంతో పాటు రోజువారి వేతనాన్ని రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో తాగునీరు, ఇతర సదుపాయాలను కల్పించాలని కోరారు. ఆయనతో పాటు బాలరాజు, తులసీరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


