శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని కొన్నావీధికి చెందిన వి.సూర్యనారాయణరాజు (91) మరణించడంతో నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. విషయాన్ని కుమారుడు వి.వి.వి.సత్యనారాయణరాజు, ఎస్.గోవిందరావు, పి.నాగేశ్వరరావు రెడ్‌క్రాస్‌కు తెలియజేయడంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ద్వారా కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. సహకరించిన కుటుంబ సభ్యులకు రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్ అభినందించారు. నేత్ర దానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు.


