చెట్టుపొదిలాం యువతి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

చెట్టుపొదిలాం యువతి ప్రతిభ

Apr 11 2026 9:16 AM | Updated on Apr 11 2026 9:16 AM

జి.సిగడాం: చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన భూపతి సాయికావ్య కేంద్ర ప్రభుత్వ కొలువుల సాధనలోసత్తా చాటింది. ఎస్‌ఎస్‌సీ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ (అడ్మినిస్ట్రేషన్‌)–టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వ శాఖ, కోర్ట్‌ మాస్టర్‌–ఆర్థిక మంత్రిత్వ శాఖ, సీజీఎల్‌ సూపరింటెండెంట్‌ ఉద్యోగాలను సాధించింది. కావ్యను తండ్రి భూపతి అర్జునరావు, తల్లి రమాదేవి, గ్రామస్తులు అభినందించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలి

శ్రీకాకుళం: వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి తక్షణం ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కార్యవర్గ సభ్యుడు పేడాడ కృష్ణారావు తదితరులుడిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్‌ తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 2014 లో పొందుపరిచిన విధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద రూ.12 వేల కోట్లు కేటాయించాలని కోరారు.

గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

రణస్థలం: జె.ఆర్‌.పురం పంచాయతీకి చెందిన నాగవరపు వీరబాబు(39) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వీరబాబు తల్లి చనిపోయినప్పటి నుంచి మానసిక ఆవేదన చెందుతూ మతిస్థిమితం లేకుండా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రణస్థలం సీహెచ్‌సీకి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. వీరబాబుకు భార్య దుర్గ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జె.ఆర్‌.పురం ఎస్సై ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement