శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ఖండించాలని జిల్లా న్యాయవాదుల బార్ అధ్యక్షుడు కూన రాజారావు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో న్యాయవాది పి.ఎల్లయ్య దారుణ హత్యకు నిరసగా జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు ర్యాలీ, మానవహారం చేపట్టారు. న్యాయవాదులపై దాడి, హత్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి చిట్టి సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు డి.సరళకుమారి, సహాయ కార్యదర్శి డి.ఈశ్వరరావు, జి.సత్యభామ, ఎస్.సుజాత, జి.ఇందిరాప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఎన్ని సూర్యారావు, బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగూరి ఉమామహేశ్వరరావు, కూన అన్నంనాయుడు, సనపల హరి, పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


