పలాస: విప్లవ సాంస్కృతికోద్యమ ధ్రువతార కానూరి వేంకటేశ్వరరావు అని అరుణోదయ సాంస్కృతి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సొర్ర రామారావు చెప్పారు. పలాస మండలం చిన్ననీలావతి గ్రామంలో కానూరి 11వ వర్ధంతి సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కానూరి 99వ ఏట అమరులయ్యారని, జీవితాంతం కళారంగానికి అంకితమయ్యారని, ఉద్దానం ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని, అరుణోదయ సంస్థ వ్యవస్థాపకులని గుర్తు చేశారు. ఎన్నో సినీ అవకాశాలు వచ్చినా ప్రజాకళలకు అంకితమైన నిజమైన ప్రజా కళాకారుడని కొనియాడారు. కార్యక్రమంలో సి.పి.ఐ.ఎం.ఎల్.న్యూడెమొక్రసీ జిల్లా నాయకుడు వంకల మాధవరావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు జుత్తు వీరాస్వామి, కుత్తుం ధర్మారావు, వంకల పాపయ్య, మురిపింటి తాతారావు, పుచ్చ దుర్యోధనరావు, ఎం.వినోద్ తదితరులు పాల్గొన్నారు .


