మహిళా టీచర్ల సమస్యలపై సంతకాల సేకరణ | - | Sakshi
Sakshi News home page

మహిళా టీచర్ల సమస్యలపై సంతకాల సేకరణ

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

శ్రీకాకుళం: మహిళా ఉపాధ్యాయులకు సంబంధించి రక్షణ, ఉన్నత పాఠశాలలో ప్రత్యేకమైన స్టాఫ్‌ రూమ్స్‌, టాయిలెట్‌ సౌకర్యాలు కల్పించాలని, మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) జిల్లా సహాధ్యక్షురాలు, జిల్లా కార్యదర్శిలు బి.ధనలక్ష్మి, జి.శారదలు అన్నారు. గురువారం యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాకుళంలోని ఎస్‌ఎస్‌సీ స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రం వద్ద యూటీఎఫ్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు విజ్ఞాపనలను అందించేందుకు మహిళా ఉపాధ్యాయుల సంతకాలు సేకరిస్తునామన్నారు. జిల్లా కన్వీనర్‌ కొరాడ శాంతిప్రియ, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement