శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.1.91 లక్షలు | - | Sakshi
Sakshi News home page

శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.1.91 లక్షలు

Mar 27 2026 9:46 AM | Updated on Mar 27 2026 9:46 AM

శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.1.91 లక్షలు ‘అనవసర భూసేకరణ చేస్తే ఉద్యమమే’ ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలు

జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వ రుని హుండీ ఆదాయం రూ. 1,91,175గా వచ్చినట్లు ఆలయ ఈఓ కె.ఏడుకొండలు గురువారం తెలిపారు. ఆలయ అధికారులు, సత్యసాయి సేవాసమితి సభ్యులు, అర్చకుల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగిందన్నారు. కార్య క్రమంలో రావివలస ఎండల మల్లికార్జునస్వా మి, దేవాలయ ఆలయ ఈఓ జి.గురునాథరా వు, పాలక మండలి చైర్మన్‌ శివప్రసాద్‌ పాడి భక్తులు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మూలపేట పోర్టుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలోనే జరిగాయని, ఇప్పుడు కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా అదనంగా సేకరించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ స్పష్టం చేశా రు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పారిశ్రామికీకరణ కోసం పారిశ్రామిక వేత్తలు స్వయంగా భూములు కొనాలని, రైతులే వారి భూములను వారికి నచ్చిన ధర చెప్పి విక్రయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. పోర్టు కోసం భూములు ఇచ్చిన మూలపేట, విష్ణుచక్రం గ్రామాల నిర్వాసితులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అప్ప ట్లో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పారిశ్రామికీకరణ కోసం అనవసర భూ సేకరణ చేసి, పారిశ్రామిక వేత్తలతో లాలూచీ పడి రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమం చేయకతప్పదని ఆయన హెచ్చరించారు.

శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు అన్‌ అయిడెడ్‌ ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు. వీరికి లాటరీ ద్వారా సీట్లు కేటాయించనున్నట్లు ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ పి.వేణుగోపాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చని, ఇతర విషయాలకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి సంప్రదించవచ్చునన్నారు. సంబంధిత పాఠశాలలు వెబ్‌సైట్‌లో చూడవచ్చునని, ఎంపికై న విద్యార్థులు ఏప్రిల్‌ 7వ తేదీలోగా ఎంపికై న పాఠశాలల్లో జాయిన్‌ అవ్వాలని పేర్కొన్నారు. వివరాలకు 1800425 8599 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement