బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రాజారావు | - | Sakshi
Sakshi News home page

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రాజారావు

Mar 27 2026 9:46 AM | Updated on Mar 27 2026 9:46 AM

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రాజారావు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సీనియర్‌ న్యాయవాది కూన రాజారావు అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. గురువా రం బార్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో అత్యధికంగా 127 ఓట్ల ఆధిక్యంతో విజయ సాధించారు. ఈయన గతంలో మూడుసార్లు అధ్యక్షుడిగా పోటీ చేశారు. ఎట్టకేలకు విజయం వరించింది. జిల్లా బార్‌ అసోసియేషన్‌లో 773 ఓట్లు ఉండగా 649 ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన కూన రాజారావుకు 387 ఓట్లు, మామిడి క్రాంతికి 260 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షులుగా డి.సరళకుమారి 15 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మిగిలిన పదవులు ఏకగ్రీవమయ్యాయి. జనరల్‌ సెక్రటరీగా చిట్టి సూర్యనారాయణ, జాయింట్‌ సెక్రటరీగా డొంకాన ఈశ్వరరావు, కోశాధికారిగా సిరిపురపు సుజా త, మహిళా ప్రతినిధిగా గురువుబెల్లి సత్యభామ, లై బ్రరీ సెక్రటరీగా కె.శంకరరావు, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చ రల్‌ సెక్రటరీగా జి.ఇందిరా ప్రసాద్‌ ఎంపికయ్యా రు. ఎన్నికల ప్రధాన అధికారిగా కంచరాన నాగభూషణరావు, ఎన్నికల సహాయకులుగా నౌపడ విజయ్‌కుమార్‌, ఎన్‌.వి.కె.సుబ్రహ్మణ్యం, పి.జయరావు, జె.శ్రీనివాసరావు, ఎం.వి.శ్రీనివాసరావు, ఎ.అప్పలరాజు వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement