నేటి నుంచి రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు

Mar 27 2026 9:46 AM | Updated on Mar 27 2026 9:46 AM

నేటి నుంచి రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు పాముకాటుతో వ్యక్తి మృతి వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రెవెన్యూ ఉద్యోగులు క్రీడా పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఏపీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుడు కె.శ్రీరాములు గురువారం పిలుపునిచ్చారు.ఈ నెల 27, 28, 29 తేదీల్లో ‘శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు’ పేరిట జరిగే పోటీల్లో ఆఫీస్‌ సబోర్డినేట్‌ నుంచి డిప్యూటీ కలెక్టర్‌ వరకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ సహాయ సహకారాలతో కార్యకర్మం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజువారి విధుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు, ఉద్యోగుల్లో ఐక్యత పెంపొందించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వద్దకు చేరుకోవాలని కోరారు.

నరసన్నపేట : మడపాం పంచాయతీ కొత్తపేటకు చెందిన పిన్నింటి రమణ (50) పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికి త్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. వారం క్రితం పొలానికి వెళ్లిన ప్పుడు పాము కరవగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పొందూరు : కనిమెట్ట ఎస్సీ కాలనీకి చెందిన కె.శ్రావణ్‌కుమార్‌(32) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రావణ్‌కుమార్‌ భార్య కొంతకాలం క్రితం రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. దీనికి తోడు తండ్రి పక్షవాతానికి గురికావడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. మరోవైపు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. వీటిని తట్టుకోలేని శ్రావణ్‌కుమార్‌ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement