శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026
పోర్టుకు సిద్ధం
1
సంతబొమ్మాళి: నౌపడలో సభా స్థలాన్ని పరిశీలిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్ తదితరులు
‘మూలపేట పోర్టుకు పోదాం పదండి’ పేరిట పోరాటానికి వైఎస్సార్‌సీపీ సన్నద్ధమవుతోంది. సమర సన్నద్ధత కార్యక్రమాలు గురువారం జిల్లా వ్యాప్తంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌తో కలిసి నౌపడలో సభా స్థలాన్ని పరిశీలించారు. కంచిలి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పరిశీలకుడు దుంపల లక్ష్మణరావు
తదితరులు పాల్గొన్నారు.


