ఎన్‌జీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌జీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన స్వాగతం

Feb 10 2026 8:10 AM | Updated on Feb 10 2026 8:10 AM

ఎన్‌జీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన స్వాగతం

ఎన్‌జీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన స్వాగతం

శ్రీకాకుళం అర్బన్‌: ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై జిల్లాకు మొదటిసారిగా వచ్చిన రాయి వేణుగోపాల్‌కు సంఘ నాయకులు, ఉద్యోగులు శ్రీకాకుళం సింహద్వారం వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి డే అండ్‌ నైట్‌ కూడలి, పాతబస్టాండ్‌ మీదుగా ఎన్‌జీవో కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వేణుగోపాల్‌ మాట్లాడుతూ సంఘ సభ్యుడిగా ప్రస్తానం మొదలై రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం వెనుక చౌదరి పురుషోత్తంనాయుడు, హనుమంతు సాయిరాంలతో కృషితో పాటు ఉద్యోగుల మద్దతు ఎంతో ఉందన్నారు. అనంతరం వేణుగోపాల్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు జయరావు, పూజారి జానకిరాం, బడగల పూర్ణచంద్రరావు, రాధాకృష్ణ, జగన్మోహనరావు, నక్క రమణమూర్తి, శ్రావణి, ఉపేంద్ర, జి.లలిత, హైమవతి, బి.గోపాల్‌, టి.శ్రీనివాసరావు, వివిధ సంఘాల ప్రతినిధులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement