ఉర్రూతలూగించిన ‘రేలా రే రేలా’
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య(నెలవారీ సాంస్కృతిక విభాగం) 315వ నెల కార్యక్రమం శనివారం నగరంలోని బాపూజీ కళామందిర్‌లో ఘనంగా నిర్వహించారు. ధర్మశాస్త సన్నిదానం ట్రస్ట్ సౌజన్యంతో నూతన వస్త్రాలు, పేద కళాకారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గజపతినగరానికి చెందిన శ్రీ విజయ జానపద కళాబృందం ‘రేలా రే రేలా‘ ప్రదర్శన ఉర్రూతలూగించింది. ఉత్తరాంధ్ర జానపదాలను పి.రఘు బృందం చక్కగా ఆలపించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, జిల్లా పర్యాటక శాఖ అధికారి నడిమింటి నారాయణరావు, వ్యాపారవేత్త బరాటం సంతోష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బెండి శివప్రసాద్, సమాఖ్య సభ్యులు బి.ఎ.మోహనరావు, ఐ.రమణారావు, కంచరాన అప్పారావు, మెట్ట పోలినాయుడు, తాయి రవి, ఎన్ని రాజేశ్వరరావు, మజ్జి మోహనరావు, ప్రసాదరావు రౌళో, పైడి సత్యవతి, బత్తుల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఉర్రూతలూగించిన ‘రేలా రే రేలా’


