శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Jan 4 2026 6:54 AM | Updated on Jan 4 2026 6:54 AM

శ్రీక

శ్రీకాకుళం

మార్కులు.. మార్పులుఇంటర్‌ పరీక్ష విధానం మారుతోంది. దీనిపై అవగాహన కరువవుతోంది. –8లో కన్నీటి కథలు తెలుసా..? ●గురవే నమః ముగ్గు.. ముచ్చట ధనుర్మాసంలో రంగవల్లులు ఆకట్టుకున్నాయి. రకరకాల ముగ్గులు కనిపిస్తున్నాయి. –8లో ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026 25 కిలోల వెన్నతో వెంకన్న స్వామికి అలంకరణ జాతీయ స్థాయి గట్కా పోటీలకు సిక్కోలు ప్రాతినిధ్యం భవిష్యత్‌కు టెన్త్‌ పునాది: కలెక్టర్‌ ● పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్న వలస జీవులు ● అనారోగ్యంతో మృతి చెందుతున్న వలస కూలీలు ● ప్రభుత్వం నుంచి కరువైన భరోసా ● ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు ●8 నెలల కూతురిని వదిలి.. 10న జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

న్యూస్‌రీల్‌

మార్కులు.. మార్పులుఇంటర్‌ పరీక్ష విధానం మారుతోంది. దీనిపై అవగాహన కరువవుతోంది. –8లో
కన్నీటి కథలు తెలుసా..?

సారవకోట: మండలంలోని చీడిపూడి కల్యాణ వేంకటేశ్వర స్వామికి శనివారం 25 కిలోల వెన్నతో అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి మూల విరాట్లను ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అలంకరించినట్లు అర్చకులు రామానుజాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక, విశేష పూజలు, అభిషేకాలు, తులాభారం నిర్వహించారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి గట్కా(మార్షల్‌ఆర్ట్స్‌) స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్‌లోని లూథియానా వేదికగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు ఆలిండియా స్కూల్‌గేమ్స్‌ అండర్‌–19 బాలబాలికల గట్కా చాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎం.మోహన్‌ (10వ తరగతి), జి.అగస్థ్యరాం (10వ తరగతి), ఎల్‌.కీర్తి (8వ తరగతి) ఎంపి కయ్యారు. అలాగే ఇవే పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బృందానికి మేనేజర్‌గా ఫిజికల్‌ డైరెక్టర్‌ నిమ్మక పార్వతి నియామకమయ్యారు. ఈ పోటీల కోసం వీరంతా ఆదివారం ఇక్కడ నుంచి లూథియానా పయనమై వెళ్తున్నారు.

నరసన్నపేట: విద్యార్థి దశలో టెన్త్‌ చాలా కీలకమని, ఈ తరగతి మీ భవిష్యత్‌కు పునాది వేస్తుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. కంబకాయ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఇన్‌చార్జి ప్రధాన ఉపాధ్యాయులు బమ్మిడి మన్మధరావుతో పాటు ఉపాధ్యాయులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాగోటి ఉమామహే శ్వరి, విశ్రాంత ఉపాద్యాయులు అప్పలనాయు డు తదితరులు ఉన్నారు.

ఇచ్ఛాపురం మండ లం ధర్మపురం గ్రామానికి చెందిన ఉప్పాడ సోమేశ్‌ (32) ఎనిమిది నెలల కుమార్తె కావ్యశ్రీని విడిచి 2023 అక్టోబర్‌ నెలలో పోలెండ్‌ వెళ్లిన కొన్నాళ్లకు అక్కడే అస్వస్థతకు గురయ్యాడు. ఊరు కాని ఊరు, భాష రాని మనుషుల మధ్య ఆస్పత్రిలో నరకయాతన అనుభవించాడు. తన కు చాలా భయంగా ఉందని, తన వద్ద ఎవ్వరూ లేరని, వైద్యం అందడం లేదంటూ భార్యకు వీడియో కాల్‌ ద్వారా తెలిపాడు. మరుసటి రోజే ఆయన ప్రాణాలు వదిలేశాడు. తన భర్త మృతదేహం స్వగ్రామానికి తెప్పించాలని భార్య అధికారులను బతిమలాడినా స్పందించలేదు. పో లెండ్‌లోనే దహన సంస్కారాలు పూర్తి చేసి బూడిదను మాత్రం ఇక్కడకు పంపారు. ప్రభుత్వం కూడా ఎలాంటి పరిహారం ఇవ్వలేదు.

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి పారా అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలను ఈనెల 10వ తేదీన నిర్వహిస్తున్నామని స్టీఫెన్‌ హాకింగ్‌ పారా స్పోర్ట్స్‌ అసోసియేష న్‌ ఆఫ్‌ శ్రీకాకుళం ఉపాధ్యక్షుడు ఎన్‌.గిరిధర్‌, కార్యదర్శి డి.అచ్యుతరావు, ఎన్‌.మోహనరావు, కోశాధి కారి ఎన్‌.స్రవంతి, మజ్జియ్య, రమేష్‌ పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక్కడ ఎంపికైన పారా అథ్లెట్స్‌ను త్వరలో జరిగే ఏపీ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్‌ పోటీలకు పంపించనున్నట్టు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఎంపికల కు హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 80081 62432, 9177693836 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు.

శ్రీకాకుళం1
1/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం3
3/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం4
4/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం5
5/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం6
6/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం7
7/7

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement