రవిబాబుకు డీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు
శ్రీకాకుళం : జిల్లా విద్యాశాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలతో ఏ.రవిబాబును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఈయన ఇప్పటికే డీఈవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా నీటియాజమా న్య సంస్థ (డ్వామా) పథక సంచాలకుడు బి.సుధాకరరావుకు డీఆర్‌డీఏ సెర్ప్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యింది. ఈ మేరకు సుధాకరరావు మంగళవారం రిలీవ్ అయ్యారు. డీఓ లవరాజుకు తాత్కాలిక పీడీగా బాధ్యతలు అప్పగించారు.
డొంకూరులో నక్క హల్‌చల్
● ఎనిమిది మందికి గాయాలు
ఇచ్ఛాపురం రూరల్: మత్స్యకార గ్రామమైన డొంకూరులో మంగళవారం ఓ నక్క స్వైర విహారం చేసింది. బస్టాండ్ కూడలిలో దాడి చేయడంతో శివంగి గణపతి, పుక్కళ్ల రామామారావు, ఎరిపల్లి జోగారావు, మాగుపల్లికుండయ్య, దున్న లక్ష్మీ, జల్దీ చిన్నారావు, దున్న హేసుందర్, దున్న శంకర్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బరంపురం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అనంతరం ట్రాక్టర్ ఢీకొనడంతో నక్క మృతిచెందింది.
సెంటు భూమి కూడా ఇవ్వం
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంతాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణానికి సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని రైతులు తేల్చిచెప్పారు. వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లిలో మంగళవారం ఆర్డీఓ జి.వెంకటేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు, తహశీల్దార్ సీతారామయ్య పర్యటించి గ్రామ సచివాలయం వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భూములు కోల్పోయే ప్రభుత్వం అందించనున్న పరిహారాన్ని వివ రించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ ధాటికి ధ్వంసమైన ఉద్యాన పంటలను కష్టపడి పునరుద్ధరించామని, వీటినే నమ్ముకొని జీవనోపాధి సాగిస్తున్నామని చెప్పా రు. అలాంటి భూములను ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వబోమని స్పష్టం చేశారు. తల్లిలాంటి భూములను తమకు దూరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
టెట్‌కు 10,499 మంది అభ్యర్థులు
శ్రీకాకుళం: ఏపీ టెట్– 2025 ఆన్‌లైన్ పరీక్షలకు జిల్లా నుంచి 10,499 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు డీఈఓ ఎ.రవిబాబు మంగళవారం తెలిపారు. ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు రెండు పూటలా పరీక్షలు జరుగుతాయనిచెప్పారు. ఎచ్చెర్లలోని శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్, టెక్కలిలోని ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సెంటర్లలో 9221 మంది, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురంలో 1278 మంది అభ్యర్థులు హాజరవుతారని వివరించారు. బరంపురంలో పరీక్ష కేంద్రానికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా డీఈఓ కార్యాలయంలో సహాయ కమిషనర్ జి.చంద్రభూషణ్(7569633183)ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
రిమ్స్ సర్వజన ఆస్పత్రి
సూపరింటెండెంట్‌గా ప్రసన్నకుమార్
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్‌ను నియమిస్తూ వైద్య విద్య కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ అమూల్య రెండు నెలల క్రితం పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పలనాయుడును తాత్కాలికంగా నియమించారు. తాజాగా ఎముకల విభాగం హెచ్‌ఓడీ ప్రసన్నకుమార్‌ను ఆ స్థానంలో నియమించారు.
రవిబాబుకు డీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు
రవిబాబుకు డీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు


