ప్రైవేటీకరణ తగదు
ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. టీడీపీ ప్రభుత్వం కేవలం తమ వర్గీయులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలి.
– కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ
తరలిరండి
మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లొద్దపుట్టిలోని ప్రజాసంకల్పయాత్ర విజయ స్థూపం వద్ద కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇక్కడి నుంచి సంతకాలతో కూడిన పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపిస్తాం. నియోజకవర్గంలోని ప్రతికార్యకర్త హాజరుకావాలి.
– పిరియా విజయ, ఇచ్ఛాపురం నియోజకవర్గ
సమన్వయకర్త, జెడ్పీ చైర్‌పర్సన్
కూటమి కుట్ర
గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అమ్ముకునేందుకు కుట్ర పన్నారు. కూటమి పార్టీలు చేస్తున్న అరాచకాలను ప్రజలే తిప్పికొట్టాలి.
– గొర్లె కిరణ్‌కుమార్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే
నేడు నియోజక వర్గాల్లో ర్యాలీ
జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయింది. ఆ పత్రాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేశారు. సేకరించిన సంతకాల పత్రాలతో నియోజకవర్గాల్లో బుధవారం ప్రజా ఉద్యమం ర్యాలీలు నిర్వహిస్తారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయానికి ఆ పత్రాలు తీసుకెళ్తారు.
ప్రైవేటీకరణ తగదు


