ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్ జగన్ తీసుకువచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ అన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పేద, బడుగు,బలహీనవర్గాల వారి అభిప్రాయాల్ని సంతకాల రూపంలో సేకరించామని, ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన పత్రాలను ఈ 10వ తేదీన ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాల్లో జిల్లా కేంద్రంలో పార్టీ కా ర్యాలయానికి చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమం ఓ పండుగ వాతావరణంలో జరగాలన్నారు. దీనిపై శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 13వ తేదీన అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఉన్న సంతకాల పత్రాలను ఓ ప్రత్యేక వాహనంలో కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లికి పంపిస్తామని తెలిపారు. ఈ నెల 16వ తేదీన కోటి సంతకాల సేకరణ, ప్రైవేటీకరణ వల్ల నష్టాన్ని తెలియజేసేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి గవర్నర్‌కి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు దుంపల లక్ష్మణరావు, కేవీజీ సత్యనారాయణ, ఎస్‌ఈసీ మెంబర్ గొండు కృష్ణమూర్తి, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు, వెలమ కుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, కూరాకుల, పొందర కుల రాష్ట్ర అధ్యక్షుడు రాజాపు అప్పన్న జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, పార్టీ అధికార ప్రతినిధి దుర్యోధన, గ్రీవెన్స్‌సెల్ జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వజ్జ వెంకటరావు, కింజరాపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
13న తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి చేరిక
16న గవర్నర్‌కి కలిసే కార్యక్రమం
భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలిరావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్ పిలుపు


