రథసప్తమి ఏర్పాట్లపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్:
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి సన్నిధిలో జరగనున్న రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండరాదని కలెక్టర్ స్విప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవ నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు రోజుల పాటు ఆస్థాన సేవ, తిరువీధి, స్వామి అలంకరణ, లక్షపుష్పార్చన, సూర్య నమస్కారాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫుడ్ కోర్టులు, సైనేజ్ బోర్డులు, ఆహ్వానపత్రాల పంపిణీ, పార్కింగ్ ప్రాంతాల నిర్వహణకు సంబంధించి అధికారులను నామినేట్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, డీఆర్‌ఓ లక్ష్మణమూర్తి, శ్రీకాకుళం ఆర్‌డీఓ కె.సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, డీఎంహెచ్‌ఓ అనిత, సుడా ఈఈ సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు.
రథసప్తమి ఏర్పాట్లపై సమీక్ష


