● జగపతిబాబు సందడి
మేం రైతులం కాదా?
అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతుల ఖాతాలో డబ్బు లు జమ చేస్తారన్నారు. మా గ్రామంలో మాత్రం ఏ రైతుకూ డబ్బులు జమకాలేదు. మేం రైతులం కాదా?
– బొల్లు జమ్మినాయుడు, రైతు, సేతుభీమవరం
నమ్మించి ముంచేశారు
కూటమి నాయకుల మాటలు నమ్మి మోసపోయాం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏటా రూ.13,500 రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేసేవారు. చంద్రబాబునాయుడు పాలనలో ఒక పైసా కూడా జమకాలేదు.
– సాకాబత్తుల రమణ, రైతు, సేతుభీమవరం
రైతులంటే చిన్న చూపు
అన్నదాత సుఖీభవ పథకంతోపాటు ప్రభుత్వం మంజూరు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు అందడం లేదు. జగనన్న హయాంలో మాకు రైతు భరోసా పథకం వచ్చింది. రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు. – బొల్లు రమేష్, రైతు, సేతుభీమవరం
మోసపోయాం
గతంలో రైతులకు ఏటా రూ.13,500 ఇచ్చేవారు. చంద్రబాబు ప్రతి రైతుకు రూ.20 వేల ఇస్తామని హామీ ఇవ్వడంతో ఓట్లు వేసి మోసపోయాం.
– సాకాబత్తుల అప్పారావు, రైతు, సేతుభీమవరం
● జగపతిబాబు సందడి
● జగపతిబాబు సందడి
● జగపతిబాబు సందడి
● జగపతిబాబు సందడి
● జగపతిబాబు సందడి


