గంజాయి అడ్డాలు..!
● గ్రానైట్ క్వారీలే
● కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఇలాకాలో తరచూ పట్టుబడుతున్న వైనం
● గ్రానైట్ పరిశ్రమల్లో పని చేస్తున్న ఇతర రాష్ట్రీయుల ద్వారా సరఫరా
దృష్టిపెడతాం..
టెక్కలి నుంచి నరసన్నపేట వరకు ఉన్న కర్మాగారాలపై దృష్టిపెడతాం.క్వారీలు, ముఖ్య కేంద్రాల వద్ద తనిఖీలు చేపడతాం. గంజాయి విషయంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. – డి.లక్ష్మణరావు, డీఎస్పీ, టెక్కలి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు ఇలాకాలో గంజాయి అక్రమ రవా ణా విస్తరిస్తోంది. అచ్చెన్న సొంత నియోజకవ ర్గంలో కోటబొమ్మాళి, నిమ్మాడ కూడలి కేంద్రాలుగా అధిక సంఖ్యలో ఉన్న గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ పరిశ్రమలతో పాటు, గ్రానైట్ రాళ్ల తవ్వక పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. గంజాయి క్రయవిక్రయాల్లో వీరి పాత్ర ఉన్నట్లు పలు కేసులు రుజువు కావడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
వారిపైనే అనుమానం..
కోటబొమ్మాళి, నిమ్మాడ ప్రాంతాల్లో దాదాపు 100కు పైగా గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలే కాక గ్రానైట్ రాళ్లు తవ్వే క్వారీలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో సుమారు వెయ్యి మందికి పైగా కార్మి కులు పనిచేస్తున్నారు. వీరిలో ఒడిశా, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలకు చెందినవారు దాదాపు 500 మంది ఉన్నారు. స్వస్థలాల నుంచి రైళ్లు, బస్సుల్లోనూ రాకపోకలు సాగిస్తుంటారు. బరంపురం రోడ్డు వద్ద రైలెక్కి హరిశ్చంద్రపురం, తిలారు వద్ద సాధారణ డీఎంయూ బళ్లపై వస్తుంటారు. వీరిలో కొందరు 5 కిలోల నుంచి 10 కిలోల లోపు గంజాయిని తెచ్చి నేరుగా కర్మాగారాలకు, స్థానిక కార్మికులతో పాటు రాజస్థానీయులకు అందిస్తుంటారని సమాచారం. అక్కడి నుంచి జర్జంగి, పెద్దబమ్మిడి, నిమ్మాడ కూడలి కేంద్రాలుగా చేసుకుని చీకటి సమయాల్లో గంజాయి క్రయ విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏదీ నిఘా..?
ప్రధానంగా ఉండే పాతపట్నం, ఇచ్ఛాపురం–పురుషోత్తపురం, పైడిభీమవరం చెక్‌పోస్టులతో పాటు డైనమి క్ చెక్‌పోస్టులు పోలీసులు ఏర్పాటు చేసినా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఏడాది కాలంగా కోటబొమ్మాళిలో పదికి పైగా గంజాయి కేసులు నమోదు కాగా వారిలో ఒడిశా వారి పాత్రే ఎక్కువ. జి ల్లాలో ఈ ఏడాది 1200కిలోలకు పైగా గంజాయిప ట్టుబడింది. పట్టుబడిన వారిలో ఒడిశా వారే ఎక్కువ.
మార్గాలివే..
వీరంతా రాత్రి వేళల్లో లూప్‌లైన్ మార్గాలు ఎంచుకుని వస్తున్నారన్నది సమాచారం.
పలాస : గొప్పిలి, రెంటికోట, గారబంద.
మందస : తాళ్లగురంటి, సిరిపురం, సాబకోట, బుడార్సింగి, బీవైపురం, గొప్పిలి రోడ్డు జంక్షన్.
బెండిగేట్: టెక్కలిపట్నం, చాపర, పి.పద్మాపురం
ఒడిశా సుంకి చెక్‌పోస్టు : పార్వతీపురం మన్యంజిల్లా సాలూరు, రాజాం, చిలకపా లెం (పొందూరు రోడ్డు మీదుగా)
గంజాయి అడ్డాలు..!


