వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు సరికాదు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పౌరులకు మెరుగైన వైద్యం, వైద్య విద్య అందించాలన్న ఆలోచనతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు వాటిని కార్పొరేట్లకు అమ్మేస్తుంటే చూస్తు ఊరుకోవాలా?అని వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదరరావు శుక్రవారం ప్రశ్నించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వారిపై అక్రమంగా కేసులు బనాయించడం సరికాదన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసే హక్కు రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. హక్కులకు భంగం వాటిల్లేలా తప్పుడు కేసులు నమోదు చేయడం తగదన్నారు.
ట్రిపుల్ ఐటీ ఘటనపై ఆరా
ఎచ్చెర్ల: ఎస్‌ఎంపురంలోని ట్రిపుల్ ఐటీ కళాశాలలో గుంటూరుకు చెందిన విద్యార్థి సృజన్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ శుక్రవారం క్యాంపస్‌ను సందర్శించారు. డైరెక్టర్ బాలాజీతో సమావేశమై ఘటనలకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన విద్యార్థిపై అభాండాలు మోపడం అన్యాయమన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ సనపల నారాయణరావు, ఎంపీపీ ప్రతినిధి జరుగుళ్ల శంకరరావు, జి.సిగడాం మండల పార్టీ అధ్యక్షుడు డోల వెంకటరమణ, సర్పంచ్‌లు కోన సూర్యారావు, డొంక వెంకటరమణ, తండ్యాల లక్ష్మణరావు, ఎంపీటీసీలు సీరపు శ్రీరామూర్తి, వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కోటిపాత్రుని శివ, రామానుజం పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు సరికాదు


