సినీ పరిశ్రమలో సిక్కోలు చంటి
● దర్శకుడిగా లింగాలవలస కుర్రాడు చంటి
● నేడు 200 థియేటరల్లో విడుదల కానున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’
రణస్థలం: జిల్లా నుంచి మరో కుర్రాడు తెలు గు సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. లావేరు మండలం లింగాలవలస గ్రామానికి చెందిన లుకలాపు రాహుల్ అలియాస్ చంటి సినీ ఇండస్ట్రీలో దశాబ్దకాలంగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయగా.. తాజాగా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సర్వం సిద్ధమైంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 థియేటర్లలో విడుదల కానుంది.
కాలేజీ రోజుల నుంచే..
చంటి తల్లిదండ్రులు అప్పలనాయుడు, ఇందిర సాధారణ రైతు కుటుంబీకులు. ప్రాథమిక విద్య అంతా విజయనగరం, శ్రీకాకుళంలోనే పూర్తి చేశాడు. చంటికి సినిమాలంటే ఆసక్తి. ఇంజినీరింగ్ చదువుతుండగానే సినిమా మే కింగ్‌కు సంబంధించిన అంశాలను తెలుసుకున్నాడు. యూట్యూబ్ చానెల్‌లో పనిచేసి వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించాడు. అలా సినిమాల్లో పలువురు సినీ దర్శకులతో పరిచయా లు పెంచుకున్నాడు. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత తిరువీర్ హీరోగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకు దర్శకుడిగా మారాడు.


