తుఫాన్ రేషన్ సరిచేశారు
పోలాకి: మోంథా తుఫాన్ బాధి త తీర ప్రాంతాల్లో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన రేషన్ సరుకులు లబ్ధిదారులకు అందకుండా సగం పంపిణీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నానికి పోలాకి మండల తీర ప్రాంత గ్రామాల్లో అడ్డుపడింది. గురువారం ‘సాక్షి’లో ‘తుఫాన్ రేషన్‌లో చేతివాటం..?’ అనే శీర్షికతో ఒక వార్త ప్రచురితమైంది. అధికార పార్టీకి చెందిన రేషన్ డీలర్లు తుఫాన్ సరుకులు సగం పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారని లబ్ధిదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సివిల్ సప్లై అధికారులు రంగప్రవేశం చేశారు. పోలాకి తహసీల్దార్ శ్రీనివాసరావు ఆదేశాలతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శివ, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది కలసి రాజారాంపురం గ్రామంలో డిపోల వద్ద రేషన్ సరుకులను దగ్గరుండి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంచదార, నూనెతోపాటు మొత్తం సరుకులను లబ్ధిదారులకు అందజేశారు.
క్షతగాత్రులను పరిశీలించిన కలెక్టర్
శ్రీకాకుళం రూరల్: పలాస–కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 9 మంది చనిపోగా ముగ్గురు క్షతగాత్రు లు రాగోలు జెమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరిని కలెక్టర్ స్వప్నిల్ దిన కర్ పుండ్కర్ గురువారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి సిబ్బంది వివరించారు.
తుఫాన్ రేషన్ సరిచేశారు
తుఫాన్ రేషన్ సరిచేశారు


