పాదయాత్ర చారిత్రక ఘట్టం
టెక్కలి: రాష్ట్రంలో పేద, సామాన్య వర్గాలు పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకోవడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఓ చారిత్రక ఘట్ట మని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం కోటబొ మ్మాళి మండలం నీలంపేట గ్రామంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ 2017 సంవత్సరం నవంబర్ 6న ఇడుపులపాయలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను నేరుగా కలిసి వారి కష్టాలను తెలుసుకున్నా రని తెలిపారు. అందుకే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాలు అందించారని తెలిపారు. మళ్లీ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్య మంత్రి చేయాలని కృష్ణదాస్ కోరారు. అనంతరం తిలక్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాదిరిగా ఏ నాయకుడు సంక్షేమ పథకాలు ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఏడాదిన్నర కాలంలోనే ప్రజలకు పూర్తిగా పరిస్థితి అర్థమైందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, పార్టీ మండల అధ్యక్షుడు సంపతిరావు హేమసుందర్‌రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, మండల నాయకులు బి.వెంకటరమణ, కె.సంజీవ్, డి.రామకృష్ణారెడ్డి, పేడాడ వెంకట్రావు, ఎస్.జనార్ధన్‌రెడ్డి, ఎం.సింహాచలం, కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్.నారాయణరావు, ఎం.వాసు, లాడి వైకుంఠరావు, పట్నాన శివ, చిన్నయ్య, ఎస్.వినోద్, కె.గణపతి, ఎ.గున్నయ్య, అప్పన్న, ఎం.శాంతారావు, ఎస్.నారాయణరాజు తదితరులు ఉన్నారు.


