శ్రీకాకుళం
న్యూస్‌రీల్
నడివీధిలో నత్త నడక
● కనుగులవలసలో వింత సమస్య ● ఇళ్లలోకి చొరబడుతున్న నత్తలు ● ఆందోళనలో గ్రామస్తులు
శుక్రవారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2025
సాఽదారణంగా వీధి కుక్కలు, పందులు, ఇతర జంతువుల బెడదతో ప్రజలు ఇబ్బందుల పడటం చూస్తుంటాం. కానీ ఆమదాలవలసమండలం కనుగులవలస గ్రామంలో మాత్రం నత్తగుళ్ల లు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జిల్లాలో ఎక్కడా లేని సమస్య తమ గ్రామాన్నే పట్టిపీడించటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా చెరువులు, నదులు,సముద్రతీర ప్రాంతాల్లో నత్తల అలజడి ఉంటుంది. ఇక్కడ అటువంటివేమీ లేకపోయినా వీధుల వెంబడి ఇళ్లలోకి నత్త లు వచ్చేస్తుండటంతో గ్రామస్తులు కలవరపడుతున్నారు. రైల్వేట్రాక్‌కు ఆనుకొని ఈ గ్రామం ఉన్నందున, ట్రాక్ పక్కనే ఉన్న నిల్వనీరు వల్ల నత్తలు నిత్యం ఇళ్లల్లోకి చొరబడుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఈ సమస్య కొత్తగా వచ్చిందని, గతంలో ఎప్పడూ ఇలా జరగలేదని చెబుతున్నారు.
దుర్వాసనతో ఇక్కట్లు
ఇటీవల కాలంలో నత్తల తాకిడి ఎక్కువైందని, ముఖ్యంగా వర్షం వచ్చిన సమయంలో వీటి ప్రభా వం ఎక్కువగా కనిపిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్లల్లోకి చొరబడటంతో ఆందోళన చెందుతున్నారు. కొంతదూరం ప్రయాణం చేసిన తర్వాత అవి మృతిచెందటం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ముక్కుమూసుకొని జీవనం సాగించాల్సి వస్తోందని వారంతా గగ్గోలు పెడుతున్నారు. రోగా ల భయం పొంచి ఉందని వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నత్తల బెడ ద నుంచి రక్షించాలని పలువురు కోరుతున్నారు.
–ఆమదాలవలస రూరల్
శ్రీకాకుళం
శ్రీకాకుళం


