ఆ గ్రామాలకు రాకపోకలు కట్
● మోంథా తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న వరద నీటితో టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి సమీపంలో గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెద్దరోకళ్లపల్లి, సీతారాంపల్లి, రామనగరం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
● పొందూరు మండలంలో రెల్లిగెడ్డకు వరద నీరు పోటెత్తెంది. లైదాం కల్వర్టు బ్రిడ్జి పైనుంచి వరద నీరు పారుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
● పొందూరు మండలం పెనుబర్తి–గోరింట రైల్వే అండర్ పాసేజ్ పూర్తిగా నీటితో నిండి పోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. –టెక్కలి/పొందూరు


