● విద్యుత్ శాఖకు రూ.11.93 లక్షల నష్టం
మోంథా తుఫాన్ కారణంగా మూడు రోజుల్లో సర్కిల్ పరిధిలోని శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్‌లలో విద్యుత్ శాఖకు రూ.11,93,935 మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ 61 ఎల్‌టీ విద్యుత్ స్తంభాలు, 11 కె.వి.విద్యుత్ స్తంభాలు 36 నేలకూలిపోగా, 27 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయని వివరించారు. 33 కె.వి.ఫీడర్లు 03, 11 కె.వి.ఫీడర్లు 12 వరకు దెబ్బతిన్నాయని వివరించారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్ సరఫరాకు ఎక్కడా అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పునరుద్ధరణ పనులకు రూ.11,93,935 మేరకు నిధులు ఖర్చుచేసినట్లు వెల్లడించారు. –అరసవల్లి


