ఉత్తరప్రదేశ్ యువకుడు ఆత్మహత్య
నాలుగు షాపుల్లో చోరీ
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఉత్తరప్రదేశ్ యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ కె.జగన్నాథరావు తెలియజేశారు. కళింగ రోడ్డులోని మైలపల్లి కృష్ణారావు ఇంటి మేడపై గదిలో అద్దెకు ఉంటున్న ఇబ్రహీం(21) యూపీలోని బాస్పూర్ సమీప ఉద్ధమ్‌సింగ్ నగర్‌కు చెందినవాడు. గత కొంతకాలంగా సూర్యమహల్ కూడలి సమీపంలోని ఒక సెలూన్ షాపులో పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం యూపీ వెళ్లిన ఇబ్రహీం మళ్లీ నగరానికి తిరిగొచ్చాడు. అక్కడ పెళ్లిచూపులు నచ్చకపోవడంతో బుధవారం ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా స్థానికులు ఇబ్రహీం ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.


