● 10 మండలాలపై ఎక్కువ ప్రభావం | - | Sakshi
Sakshi News home page

● 10 మండలాలపై ఎక్కువ ప్రభావం

Oct 30 2025 7:47 AM | Updated on Oct 30 2025 7:47 AM

● 10

● 10 మండలాలపై ఎక్కువ ప్రభావం

నేలకొరిగిన వేలాది ఎకరాల వరి పంట

పలుచోట్ల పడిపోయిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు

కూలిన ఇళ్లు, దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

మోంథా తుఫాన్‌ తీరం దాటింది. జిల్లా రైతాంగానికి తీరని నష్టం మిగిల్చింది. తీరం దాటిన సమయంలో జిల్లాపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి చేలు ఎక్కడికక్కడ ముంపునకు గురయ్యాయి. పంట కోత దశలో ఉన్న సమయంలో వరి పంట నేలమట్టం కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఎడతెరిపి లేని వానల ధాటికి పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోయాయి. చెట్లు నేలమట్టమయ్యాయి.

అన్నదాతపై ప్రభావం..

ఇటీవల వాయుగుండం ప్రభావంతో కొంత నష్టం జరగ్గా, తాజా తుఫాన్‌తో రైతుకు మరింత నష్టం సంభవించింది. జిల్లాలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు గుర్తించిన మేరకు సుమారు 7500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. 10 ఎకరాల 50 సెంట్లలో మొక్కజొన్న, సుమారు 100 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. 278 కొబ్బరి చెట్లు పూర్తిగా పడిపోయాయి. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. జిల్లా వ్యాప్తంగా 44 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో పూర్తిగా ఏడు ఇళ్లు కూలిపోగా, 34 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 16.38 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి.

ఉగ్రరూపం దాల్చిన బాహుదా!

ఇచ్ఛాపురం రూరల్‌: మోంథా తుఫాన్‌ ప్రభావంతో ఇచ్ఛాపురం అతలాకుతలమైంది. ఒడిశా భగలట్టీ డ్యామ్‌ మూడు గేట్లు ఎత్తివేయడంతో బుధవారం ఉదయం బాహుదానదిలో 55 వేల క్యూసెక్కుల నీరు చేరింది. సాయంత్రానికి 41,025 క్యూసెక్కులకు తగ్గింది.

గొట్టాకు వరదనీటి తాకిడి

హిరమండలం: వంశధార నదిలో వరద ప్రవాహం పెరిగింది. తుఫాన్‌ నేపథ్యంలో ఒడిశాతో పాటు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీటి ప్రవాహం పెరిగి గొట్టా బ్యారేజీకి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నానికి 38138 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. 22 గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు విడిచిపెడుతున్నారు.

శ్రీకాకుళం నగరంలో జోరువాన

వజ్రపుకొత్తూరు మండలం పెదబాడాంలో కోతకు గురైన రోడ్డు

కళింగపట్నం– మత్స్యలేశం పంచాయతీలోని బీచ్‌పై ‘మోంథా’ తుఫాన్‌ ప్రభావం చూపించింది. సముద్రపు అలల తాకిడికి వంశధార నది నీరు తోడవ్వడంతో ఒడ్డునున్న హరిత రిసార్టు ప్రాంతం కోతకు గురైంది. రెండు నీటి ట్యాంకుల్లో ఒకటి పూర్తిగా విరిగిపోయింది. మరొకటి పాక్షికంగా దెబ్బతింది. గత ప్రభుత్వంలో బీచ్‌ కోత నివారణకు మంజూరైన రూ.7.58 కోట్లలో రూ.2 కోట్లు నిధుల మేర పనులు పూర్తయ్యాయి. ఎన్నికల తర్వాత కొత్త పభుత్వం వచ్చాక దీనిపై దృష్టి సారించకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. 18 నెలలు వచ్చినా పనులు ఊపందుకోకపోలేదు. నిర్లక్ష్యపు ధోరణి వల్లే పర్యాటక శాఖ ట్యాంకు కూలిపోయిందని, ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. –గార

మూడు రోజులుగా ఈదురుగాలులతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసినప్పటికీ 10మండలాల్లోని 53గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపాయి. మందస, పలాస, ఇచ్ఛాపురంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 8.30 నుంచి 28వ తేదీ ఉదయం 8.30గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 189 సెంటీమీటర్ల వర్షం పడగా, సరాసరి 6.3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 28నుంచి 29వ తేదీ వరకు 159.3 సెంటీమీటర్ల వర్షం పడగా, సరాసరి వర్షపాతం 5.3 సెంటీమీటర్లుగా నమోదైంది. రెండు రోజుల్లో అత్యధికంగా మందసలో 19 సెంటీమీటర్లు, గారలో 16.4సెంట్లీమీటర్లు, వజ్రపుకొత్తూరు, పలాసలో 16.3సెంటీమీటర్ల చొప్పున, ఇచ్ఛాపురంలో 15సెంటీమీటర్ల వర్షం కురిసింది.

● 10 మండలాలపై ఎక్కువ ప్రభావం 1
1/2

● 10 మండలాలపై ఎక్కువ ప్రభావం

● 10 మండలాలపై ఎక్కువ ప్రభావం 2
2/2

● 10 మండలాలపై ఎక్కువ ప్రభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement