అక్రమ బోర్లు
అనుమతుల కోసం యత్నాలు..
విషయం బయటకు పొక్కడంతో కంపెనీ ప్రతినిధులు హడావుడిగా అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. జిల్లాలో కాకుండా ఏకంగా భూగర్భ జల శాఖ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పది బోర్లలో రెండు మాత్రమే వర్కింగ్‌లో ఉండటంతో తెలివిగా రెండు బోర్లకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ఆ మేరకు డైరెక్టర్.. జిల్లా అధికారులు పరిశీలించి, అనుమతుల కోసం నివేదిక ఇవ్వాలని కోరారు. ముగ్గురు అధికారులు రెండు రోజులుగా యూబీ బీర్ల కంపెనీలో పరిశీలించారు. అప్పటికే అక్కడ 10 వరకు బోర్లు ఉండటంతో సంబంధిత అధికారులు అవాకై ్కనట్టు తెలిసింది. అయినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలు కారణంగా అక్కడ గుర్తించిన అంశాలను ఫైండింగ్స్ కింద పంపించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
బీర్ల
కోసం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో యునైటెడ్ బ్రూవరీస్(యూబీ) బీర్ల కంపెనీ మరోసారి వివాదాస్పదంగా మారింది. కూటమి నేతల ఒత్తిళ్లు, బెదిరింపులతో ఇప్పటికే ఏకపక్షంగా వ్యవహరించి ఓ వర్గం ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేసింది. రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయి అకారణంగా ఉద్యోగుల పొట్ట కొట్టింది. తాజాగా అనుమతులు లేకుండా ఏకంగా 10 మంచినీటి బోర్లను తవ్వించి, అడ్డగోలుగా నీటి వినియోగం చేస్తుందన్న విషయం వెలుగులోకి రావడంతో మరోసారి చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఉత్పత్తుల వ్యర్థ జలాలు కాలువలో కలిసిపోతుండటంతో భూగర్భ జలాలు కలుషితమై తమ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందంటూ చుట్టు పక్కల గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.
అనుమతి లేకుండానే..
వ్యక్తిగతంగా కానీ కంపెనీ అయినా మంచినీటి బోర్లు వేసుకోవాలంటే తప్పనిసరిగా భూగర్భ జల శాఖ అనుమతి ఉండాలి. జలాల లభ్యత మేరకు అనుమతులివ్వడం, ఇవ్వకపోవడం అనేది జరుగుతోంది. కానీ యూబీ బీర్ల కంపెనీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా 10 బోర్లను అక్రమంగా వేసుకుంది. వాటికి పైపులు బిగించి, కంపెనీలో ఏర్పాటు చేసుకున్న సంపులోకి తరలిస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఆ మధ్య బంటుపల్లి పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా తమకున్న రికార్డుల మేరకు యూబీ బీర్ల కంపెనీకి అధికారిక అనుమతులు జారీ చేయలేదని లిఖిత పూర్వకంగా భూగర్భ జల శాఖాధికారులు రాసిచ్చారు. దీంతో ఆ కంపెనీలో ఉన్న బోర్లు అన్నీ అక్రమమే అని తేలిపోయింది.
యూబీ బీర్ల కంపెనీ వెనక నుంచి వదిలేస్తున్న వ్యర్థ జలాలు
యూబీ బీర్ల కంపెనీలో అనుమతుల్లేకుండా వేసిన బోర్లు
వివాదాస్పదంగా మారిన యూబీ బీర్ల కంపెనీ
భూగర్భజల శాఖ అనుమతి లేకుండా
10 మంచినీటి బోర్ల తవ్వకం
సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి..
బయటికి పొక్కడంతో ఉన్నతాధికారుల ద్వారా పైరవీలు
వ్యర్థ జలాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం
ఆందోళనలో పరిసర గ్రామాల ప్రజలు
బయటకు వ్యర్థ జలాలు..
బీర్ల కంపెనీలో ఉత్పత్తుల వ్యర్థజలాలను వెనక నుంచి బయటకు వదిలేస్తున్నారు. అవి సమీపంలోని కాలువలో కలుస్తూ మరింత ప్రమాదకరంగా మారాయి. భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. వ్యర్థ జలాలు ఆయా గ్రామాల తాగునీటి వనరులపై ప్రభావం చూపితే ముప్పు తప్పదు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అసలు అక్కడేం జరుగుతుందో.. వ్యర్థ జలాల వల్ల హాని లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారో లేదో తెలియడం లేదు.
అక్రమ బోర్లు
అక్రమ బోర్లు


