
కొనకుండానే పేలుతున్నాయ్!
నరసన్నపేట, శ్రీకాకుళం కల్చరల్: తగ్గిన జీఎస్టీలతో బాణసంచా ధరలు తగ్గుతాయని భావించిన వారికి మందుగుండు ధర దడ పుట్టిస్తోంది. ధరలు గత ఏడాది కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. జిల్లాలో శనివారం నుంచి వి క్రయాలు ప్రారంభించారు. శాశ్వత దుకాణాల్లో ముందు నుంచే విక్రయాలు ఉన్నా తాత్కాలిక లైసెన్సులు పొందిన దుకాణాల వద్దనే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అధికంగా సేల్ అయ్యే అగ్గిపెట్టెలు, తారా జువ్వలు, మతా బులు, క్రాకర్లు, భూచక్రాలు, చిచ్చుబుడ్డీలు, థౌజెండ్ వాలా వంటి సామగ్రి ధరలు అధికంగా ఉన్నాయి. గత ఏడాది కంటే 20 శాతం వరకూ ధరలు అధికంగా ఉన్నాయని వినియోగదారులు అంటున్నారు.