
అవగాహనే వెలుగు
● జిల్లావ్యాప్తంగా 100 దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులు
● దీపావళికి జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచన
శ్రీకాకుళం క్రైమ్ :
ప్రశాంత వాతావరణంలో, ప్రమాదాలకు తావివ్వకుండా జిల్లా ప్రజలు దీపావళి పండగ జరుపుకోవాలని, తక్కువ కాలుష్యం ఉన్న గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. ఇళ్లలో, దుకాణాల్లో లైసెన్సు లేకుండా బాణసంచా నిల్వలు ఉంటే దా డులు నిర్వహించి కేసులు పెడతామన్నారు. బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్సు చేసినా, వాహనాలు నడిపినా, పేకాట నిర్వహించినా జైలు కు వెళ్లడం ఖాయమన్నారు. జిల్లాలో వంద దుకాణాలకు బాణసంచా సామగ్రి విక్రయించేందుకు తాత్కాలిక అనుమతి ఇచ్చారు. పర్మినెంట్ షాపులు 12 ఉన్నాయి.
హద్దులు దాటితే అనర్థమే..
● టపాసుల్లో టాక్సిక్ కారకాలైన రాగి, కాడ్మియం, సీసం, మెగ్నీషియం, జింక్, సోడియం, పొటాషియం, గంథఽకం వంటివి ఉండటంతో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా భూచక్రాలు, పాము మాత్రలు, మతాబులు, చిచ్చుబుడ్లు వల్ల అధికంగా పొగ వ్యాపిస్తుంది.
● టపాసులు పేల్చినప్పుడు వెలువడే ధ్వని అపరిమితంగా ఉంటుంది. బాణసంచా కాల్చేటప్పు డు 125 నుంచి 130 డెసిబుల్స్ శబ్దం వెలువడుతుంది. సాధార ణ మనిషి వినికిడి శక్తి 50 డెసిబుల్స్ మాత్ర మే. అంతకు మించి శబ్దాలను వింటే వినికిడి సమస్యల బారినపడ్తారు.
అనర్థాలే అధికం..
భారీ శబ్దాలు, రసాయనాలు వెలువరించే బాణసంచా స్థానంలో మట్టి దీపాలు, కొవ్వొత్తులు, విద్యుత్ దీపాలను వెలిగించాలి. గాలి, శబ్ద కాలుష్యం నివారించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. టపాసుల త యారీలో కాపర్, కాడ్మియం, లెడ్, అమ్మోనియం, నైట్రోజన్ ఆకై ్సడ్, సల్ఫర్ డయాకై ్సడ్, సోడియం, మెర్క్యురీ, లిథియం, పొటాషియం వంటి అనేక మిశ్రమాలతో తయారు చేస్తారు. వీటి నుంచి వచ్చే వెలుగులతో కన్ను, ఘాటు వాసనతో ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయి.
ప్రమాదాలు సంభవిస్తే..
● టపాసులు కాల్చినప్పుడు అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణమే దగ్గరలో ఉన్న అగ్నిమాపక కేంద్రాలకు లేదా 101 నంబర్‌కు డయల్ చేసి సమాచారమివ్వాలి. 100, 108 నంబర్లనూ సంప్రదించాలి.

అవగాహనే వెలుగు

అవగాహనే వెలుగు