
కొండ దగ్గర కాపుకాసి..
విజయనగరం జిల్లా డెంకాడ మండలం గునపురం పేట గ్రామానికి చెందిన ఎస్.బంగారునాయుడు శ్రీకాకుళం జిల్లాలో పలు పోలీస్‌స్టేషన్లలో పనిచేశారు. 1992 మార్చి 24న కాశీబుగ్గ ఎస్‌హెచ్‌వోలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మందస మండలం భేతాళపురంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో స్పెషల్ బ్రాంచి ఎస్‌ఐ జగన్మోహనరావు, ఏడుగురు రిజర్వ్ సిబ్బందితో కలిసి రైడ్‌కు వెళ్లారు. ఇద్దరు నిందితులను పట్టుకుని వస్తున్న సమయంలో రట్టికొండ దగ్గర కొండచాటు నుంచి నాగావళి దళం కాల్పులు జరిపారు. ఎదురు కాల్పులు జరిగినా.. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో వీరోచితంగా పోరాడి అదే రోజున బంగారునాయుడు వీర మరణం పొందారు.