
సలామ్
త్యాగాలకు
వీరోచితంగా పోరాడి..
కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామానికి చెందిన ఎ.పాపారావు 1971లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో పలాస మండలం నీలిభద్రలో కంబిరిగాం చౌదరి అనేవ్యక్తిని హతమార్చి ఆస్తిని దోచుకునేందుకు నక్షలైట్లు ప్రణాళిక రచించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నలుగురు కానిస్టేబుళ్లతో పికెట్ ఏర్పాటుచేసి హెడ్ కానిస్టేబుల్ పాపారావును ఇన్‌చార్జిగా నియమించారు. 1997 జులై 17న అర్ధరాత్రి మావోయిస్టులు ఆ ఇంటిపై తుపాకుల గుళ్లతో దాడికి ఎగబడ్డారు. చౌదరిని రక్షించే క్రమంలో వీరోచితంగా పోరాడిన పాపారావు వీరమరణం పొందారు.
స్పెషల్ టాస్క్ ఫోర్స్‌లో పనిచేస్తూ..
పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి వెంకటరమణ 1998లో కానిస్టేబుల్‌గా చేరారు. జిల్లా స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. బత్తిలి పీఎస్ పరిధిలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో అక్కడి ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ వెంకునాయుడు, 27 మంది స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి నులకజోడు గ్రామానికి చేరుకున్నారు. 16 మంది మావోయిస్టులు ముందుగా ఐదుచోట్ల పాతిపెట్టిన మందుపాత్రలను పేల్చి పోలీసులపై కాల్పులు జరిపారు. వెంకటరమణ వీరోచితంగా పోరాడి కాల్పుల్లో మరణించారు.
శ్రీకాకుళం క్రైమ్: లక్షలాది జనాభా పాల్గొనే సమావేశాలు.. ఇసుకేస్తే రాలనంత రద్దీగా ఉన్న దేవాలయాలు.. మండుతున్న ఎండల్లో భోజనం లేకపోయినా బందోబస్తు కాయాల్సిందే. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో విధులంటే కత్తిమీద సామే. అలా నక్సలైట్ల దాడుల్లో అశువులు బాసిన పోలీసులు ఎందరో అమరులయ్యారు. ప్రతీ ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారిని స్మరిస్తూ జిల్లాలో ఈ నెల 21 నుంచి 31 వరకు స్మారకోత్సవాలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు.
స్మారకోత్సవం ఎందుకంటే..
1959 అక్టోబరు 21న దేశ సరిహద్దులో చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం దీటుగా ఎదురొడ్డి పోరాడింది. జవాన్లు పది మంది ప్రాణాలను కోల్పోవడమే కాక ఎంతోమంది పోలీసులు సైతం వివిధ ఘటనల్లో ప్రాణాలు సైతం కోల్పోయారు. వీరి సేవలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరులు సంస్మరణ దినాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. జిల్లాలో పలువురు అమరులైన పోలీసులను, వారి త్యాగాలను స్మరించుకుందాం.
పీపుల్స్ గ్రూప్ చేతిలో బలి..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సంతకవిటి మండలం వాల్టేరు గ్రామానికి పి.కృష్ణమూర్తి 1988లో పోలీస్ కానిస్టేబుల్‌గా చేరారు. మావోయిస్టుల కార్యకలాపాల సమాచార సేకరణలో కీలకంగా వ్యవహరించడంతో ఇతన్ని మట్టుబెట్టేందుకు నక్షక్సల్స్ పథక రచన చేశారు. మందస పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో 2000 జూన్ 5న పీపుల్ గ్రూప్ నక్సలైట్లు మాటువేసి హరిపురం కూడలికి చేరుకున్న కృష్ణమూర్తి, పీసీ కె.రమేష్‌లపై దాడిచేశారు. ఆ దాడిలో కృష్ణమూర్తి నేలకొరిగారు.
సమాచార సేకరణలో దిట్ట ..
టెక్కలి గ్రామానికి చెందిన ఎం.నరేంద్రదాస్ 1976లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. మావోయిస్టుల సమాచార సేకరణలో దిట్టగా పేరుగాంచారు. వారి ఉద్యమాలను నీరుగార్చేందుకు విశేష కృషి చేశారు. మావోయిస్టుల కదలికలను గమనించి వారి ఆకృత్యాలను నిరోధించడంలో నరేంద్రదాస్ సఫలమవుతుండటాన్ని వారు సహించలేకపోయారు. 1997 మార్చి 17న కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే సమయంలో దారిలో దైవ దర్శనానికి ఆగి ఉన్న సమయం చూసి మావోయిస్టులు కాల్పులు జరపగా దాస్ వీరమరణం పొందారు.
రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
జిల్లాలో అమరులైన ఐదుగురు పోలీసులు
స్మారకోత్సవాలకు సన్నద్ధమైన పోలీసు అధికారులు

సలామ్

సలామ్

సలామ్

సలామ్