
అంతేనా మా గతి!
ఒకే గది..
టెక్కలి: పాలకుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. టెక్కలి ఆదిఆంధ్రా వీధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే గదిలో భోదన.. వసతితో అవస్థలు పడుతున్నారు. పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు సుమారు 141 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల వేళల్లో తరగతి గదిలో పాఠాలు నేర్చుకుంటూ.. రాత్రి వేళల్లో అదే గదిలో నిద్రపోతున్నారు.
అసంపూర్తిగా భవనాలు..
గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థుల కోసం అంజనాపురం సమీపంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో సుమారు 8.75 కోట్ల రూపాయలతో అదనపు భవనాలకు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అవి అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులకు వసతి గదుల కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
పాఠశాల తరగతి గదుల్లోనే రాత్రి వేళల్లో నిద్రిస్తున్నాం. చాలీచాలని గదులతో ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాలకు సమీపంలో చేపట్టిన భవనాల నిర్మాణం పూర్తి చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
– జి.యశ్వంత్, విద్యార్థి,
గిరిజన ఆశ్రమ పాఠశాల, టెక్కలి
పాఠశాలలో పూర్తి స్థాయిలో తరగతి గదులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఇప్పటికే అధికారులకు తెలియజేశాం. అసంపూర్తి భవనాల విషయమై ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. – నందీశ్వరరావు, హెచ్‌ఎం,
గిరిజన ఆశ్రమ పాఠశాల, టెక్కలి
బోధన, వసతికి ఒకే భవనం
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల అవస్థలు
అసంపూర్తి భవనాలు పూర్తి చేయాలని వేడుకోలు

అంతేనా మా గతి!

అంతేనా మా గతి!

అంతేనా మా గతి!