
ట్రిపుల్ ఐటీలో ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
ఎచ్చెర్ల : విద్యార్థుల్లో సృజన్మాతకత, ఆవిష్కరణ, సాంకేతిక ప్రతిభను పెంపొందించేందుకు స్థానిక రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ అండ్ ఇన్కుబేషన్ సెంటర్‌ను ఆదివారం ప్రారంభించారు.ఆప్షన్‌మేట్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ కె.వి.జి.డి.బాలాజీ, ఆప్షన్‌మేట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.శశికుమార్, పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి సీహెచ్ వాసు, డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ గేదెల రవి, అసోసియేషన్ డీన్ కె.రమణ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి సి.ప్రకాశ్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ ఇంక్యూబేషన్ ఎస్.సతీష్ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు పొందూరులో విద్యుత్ అదాలత్
అరసవల్లి: ఎచ్చెర్ల సబ్ డివిజన్ పరిధిలోని పొందూరు విద్యుత్ ఏఈ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సబ్ డివిజన్ డిప్యూటీ ఈఈ ఎస్.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ప్రస్తావించి పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.