
● ఉద్యమానికి శ్రీకారం
విజయవంతం చేయాలి
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలు అన్నీ ప్రభుత్వమే పూర్తి చేయాలి. పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగిస్తే పేదలకు వైద్యం అందదు. కూటమి ప్రభుత్వ విధానం తప్పు. పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోతారు. కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ఉద్యమంతో పాటు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి.
– వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టడంతో పాటు ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లను కూడా నాయకులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ దుర్నీతిని దునుమాడాలని జనాలకు పిలుపునిచ్చారు. ప్రైవేటువాళ్లకు అప్పగిస్తే పేదలకు వైద్య విద్య పూర్తిగా దూరమవుతుందని హెచ్చరించారు. –సాక్షి నెట్‌వర్క్

● ఉద్యమానికి శ్రీకారం

● ఉద్యమానికి శ్రీకారం

● ఉద్యమానికి శ్రీకారం

● ఉద్యమానికి శ్రీకారం