
పారదర్శకంగా పన్ను చెల్లింపు
ఎచ్చెర్ల: విద్యార్థులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలరని, ఆర్థిక అవగాహనతో జీఎస్‌టీ పన్ను చెల్లింపుల్లో పారదర్శకత పాటించి దేశాభివృద్ధికి తోడ్పడాలని విశాఖపట్నం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటిలిజెన్స్ విభాగం, సీనియర్ ఇంటిలిజెన్స్ అధికారి డాక్టర్ కేవీ మోహనరావు అన్నారు. మండలంలోని కుశాలపురంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సూపర్ జీఎస్‌టీ 2.0–సూపర్ సేవింగ్స్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్‌టీ వ్యవస్థ, దీని ప్రాముఖ్యత, పన్ను చెల్లింపులో పారదర్శకత యువతలో ఆర్థిక అవగాహన తదితర అంశాలను వివరించారు.
బయాలజీ కిట్లు అందజేత
శ్రీకాకుళం: జిల్లాలో 2025 డీఎస్సీ నుంచి బయాలజీ టీచర్లుగా ఎంపికైన వారికి బయాలజీ మెటీరియల్ కిట్లను జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం అందజేసింది. డీఈఓ ఎ.రవిబాబు చేతుల మీదుగా ఈ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ శాసీ్త్రయ దృక్పథంతో మంచి బోధన చేయాలని సూచించారు. పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ చంద్రభూషణం మాట్లాడుతూ బయోలాజికల్ సైన్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన తాను జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం, జన విజ్ఞాన వేదికల నిర్వహించే సైంటిఫిక్ టెంపర్ క్యాంపస్‌లో భాగస్వామి అవుతానని పేర్కొన్నారు.
దూడల అక్రమ రవాణా అడ్డగింత
నరసన్నపేట: జాతీయ రహదారిపై అక్రమంగా లగేజీ వాహనంలో తరలిస్తున్న 16 దూడలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు మడపాం టోల్‌గేట్ వద్ద శుక్రవారం సాయంత్రం పట్టుకున్నా రు. తిలారు నుంచి అలమండకు అక్రమంగా ఈ దూడలను తీసుకువెళ్తున్నట్లు గురించారు. వీటిని నరసన్నపేట పోలీసులకు అప్పగించగా ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి గోశాలకు పంపించారు.
రాత్రిపూట రేషన్ కోసం పాట్లు
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని గేటులో గల రేషన్ దుకాణం వద్ద శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత కూడా రేషన్ కోసం లబ్ధిదారులు వేచి ఉండడం కనిపించింది. ఒకప్పుడు ఇంటి ముంగిటకే సరుకులు వచ్చేవని, ఇప్పుడు రాత్రి సమయాల్లో ఇలా వేచి ఉండాల్సి వస్తోందని అన్నారు.
అంత్యోదయ చూపలేరా..?
చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు జన్ని గౌరమ్మ. దివ్యాంగురాలైన గౌరమ్మకు 2006లో అప్పటి ప్రభుత్వం అంత్యోదయ కార్డు మంజూరు చేసింది. హిరమండలం మండలం లోకొండ గ్రామానికి చెందిన గౌరమ్మకు తల్లిదండ్రులు లేరు. వివాహం కూడా జరగలేదు. ఒంటరిగానే జీవిస్తున్నారు. ఈ కార్డే ఆమెకు ఆధారం. కానీ కొన్నాళ్ల కిందట ఆమెకు అంత్యోదయ కార్డు తొలగించారు. అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఆమైపె ఎవరూ దయ చూపడం లేదు. ఇప్పటికై నా తన బాధను గమనించి కార్డు పునరుద్ధరించాలని ఆమె కోరుతున్నారు. – హిరమండలం

పారదర్శకంగా పన్ను చెల్లింపు

పారదర్శకంగా పన్ను చెల్లింపు

పారదర్శకంగా పన్ను చెల్లింపు