
వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్ ప్రారంభం
బీచ్‌రోడ్డు: ఆశీలమెట్ట సంపత్ వినాయగర్ ఆలయ సమీపంలో వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్‌ను శ్రీకన్య ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎన్.వి.ఎస్.గురుమూర్తి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వి–జ్యూయలరీ మార్ట్ భాగస్వాములు కోలా బాబురావు, కాకి గంగరాజు, పట్నాల శ్రీనివాసరావు, వూన వినీత్ మాట్లాడుతూ విమార్ట్ ప్రారంభోత్సవ ఆఫర్‌గా అన్ని రకాల 22 క్యారెట్ బంగారు ఆభరణాలను గ్రాము రూ.9,987 చొప్పున తరుగు 6.96 శాతం నుంచి పొందవచ్చన్నారు. అలాగే సాధారణ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదని, జీఎస్టీని కస్టమర్ తరుపున తామే చెల్లిస్తామన్నారు. కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై రూ.15,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నారు.