
తూర్పుకాపుల ఐక్యత చాటిచెప్పాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): తూర్పుకాపుల ఐక్యతను చాటిచెప్పాలని సంఘ నేతలు పిలుపునిచ్చారు. తూర్పుకాపులో ఉద్యోగులుగా ఉంటూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని శనివారం శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో సన్మానించారు. సత్కారం అందుకున్న వారిలో రిటైర్డ్ ఎంఈఓ గెడ్డాపు రాజేంద్రప్రసాద్, రిటైర్డ్ హెచ్‌ఎం దాసరి రామచంద్ర, బోడసింగి ఖగేశ్వరరావు, మెంటాడ సాంబమూర్తి, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బౌరోతు శంకరరావు, హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందిన మక్కా శ్రీనివాసరావు, మీసాల శ్రీనివాసరావు, తలగాన లింగరాజు, కిల్లాన రాంబాబు, రాజాపు శ్రీనివారావు, కర్నేన రమణమూర్తి, గొంటి తిరుపతిరావు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు బాడాన రాజు, శిష్టి వెంకటరావ్, ప్రధానోపాధ్యాయులు చెల్లి వెంకటరమణ, ఉపాధ్యాయుడు లెంక చక్రపాణి, ఉద్యోగ సంఘాల నేత కిల్లారీ నారాయణరావు, వాల్తేటి సత్యనారాయ ణ ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు రాడ కైలాసరావు, శాస పు జోగినాయుడు, వాన కృష్ణచంద్, మామిడి క్రాంతి, గొర్లె వాసుదేవరావు, తూర్పు కాపు ఉద్యోగ సంఘాల నేతలు పడాల తమ్మినాయుడు, వాళ్ళ శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు.