
స్నేహభావం పెంపొందించేందుకు కృషి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రజల మధ్య స్నేహభావం పెంపొందించడమే ఇస్కాఫ్(భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం) లక్ష్యమని సంస్థ ప్రతినిధి మల్లేశ్వరరావు అన్నారు. శనివారం నగరంలోని ఓ కల్యాణ మండపంలో జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోవిట్ యూనియన్ పతనం తర్వాత భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఇస్కాఫ్‌గా మారిందన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ ప్రపంచ శాంతికి తోడ్పడటం, ఆర్థిక సంక్షోభాలను అధిగమించడం, ఇరుగుపొరుగు దేశాలతో స్నేహ పూర్వక సంబంధాలు పెంపొందించేందుకు ఇస్కాఫ్‌లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బుడుమూరు శ్రీరామమూర్తి, గౌరవ సలహాదారుడిగా గేదెల ఇందిరా ప్రసాద్, జిల్లా అధ్యక్షుడిగా బుడుమూరు వెంకట సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జి.వి.నాగభూషణరావు, కార్యదర్శిగా గురుగుబెల్లి రాజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులుగా సీపాన రామారావు, టి.కామేశ్వరి, సనపల నారాయణరావు, సాహుకారి నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శులుగా గేదెల లక్ష్మి, టి.తిరుపతిరావు, సాదు కామేశ్వరరావు, దిబ్బ ప్రసాదరావు, కోశాధికారిగా కె.భాస్కరరావు, కార్యవర్గ సభ్యులుగా నాగేశ్వరరావు, ఈశ్వరరావు, చౌదరి సత్యనారాయణ, వడ్డాది విజయకుమార్, కుంచి చిన్నారావు, టి.వి.రమణ, తంగి యర్రమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.