
పోస్టల్ ఖాతాదారుల ఆందోళన
ఇచ్ఛాపురం: స్థానిక పోస్టాఫీస్‌లో దాచుకున్న సొమ్ములను వెంటనే చెల్లించాలని ఖాతాదారులంతా ఆందోళనకు దిగారు. ఈ పోస్టాఫీసులో దాచుకొన్న సుమారుగా రూ.3 కోట్ల సొమ్మును ఆన్‌లైన్ స్కాం కారణంగా బాధితులంతా నష్టపోయిన విషయం జులై నెలలో బాధితులకు తెలిసింది. అయితే ఖాతాదారులు దాచుకొన్న సొమ్మును ఖాతాల్లో పడేటట్లు చూస్తామని జిల్లా పోస్టల్ అధికారులు హామీచ్చారు. కానీ ఇప్పటికీ ఖాతాల్లో నగదు జమ అవ్వకపోవడంతో శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సొమ్ములు రెండు వారాల్లోగా చెల్లించకపోతే నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఇదే విషయంమై ఈ కేసును సీబీఐకి ఇవ్వగా ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోస్టల్ జిల్లా అధికారి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖాతాదారులు చాట్ల లోహిదాస్, బాలరాజు, హైమా. కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.