రైతుకు న్యాయం చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

రైతుకు న్యాయం చేయాల్సిందే

Sep 8 2025 5:04 AM | Updated on Sep 8 2025 5:04 AM

రైతుకు న్యాయం చేయాల్సిందే

రైతుకు న్యాయం చేయాల్సిందే

● ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

● జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ నర్తు రామారావు

సోంపేట : కూటమి ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు న్యాయం చేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరి యా విజయ, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి ఎరువుల కష్టాలు తెలియజేసేందుకు ఈ నెల 9న పలాసలో నిర్వహించే అన్నదాత పోరు కార్యక్రమం వాల్‌పోస్టర్లను ఆదివారం సోంపేటలో పార్టీ నాయకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. అధికారులకు, నాయకులకు విన్నవిస్తున్నా సమస్య పరిష్కా రం కావడం లేదన్నారు. రైతు సమస్యల పరిష్కా రం కోసం వైఎస్సార్‌సీపీ ఆదేశాల మేరకు అన్నదా త పోరు కార్యక్రమం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌ సీపీ అభిమానులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రైతుల కు ఇలాంటి కష్టాలు లేవని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని అన్నారు. ప్రభు త్వం దిగివచ్చి రైతులకు న్యాయం చేయడం కోసమే రైతుల తరఫున పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు మాట్లాడుతూ రైతులు అధిక ధరకు యూరియా కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే దీనికి ప్రభు త్వ వైఫల్యమే కారణమన్నారు. ప్రభుత్వం గొప్ప లు చెప్పుకోవడం మాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్తు నరేంద్ర యాదవ్‌, సాడి శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, పైల దేవదాస్‌ రెడ్డి, బోర పుష్ప, కడియాల ప్రకాష్‌, తడక జోగారావు, ఇప్పిలి కృష్ణారావు, పూడి నేతాజి, బతకల మోహనరావు, గుర్రాల శ్రీను, కారింగి మోహ నరా వు, శిలగాన భాస్కరరావు, పాతిర్ల రాజశేఖరరెడ్డి, బుద్దాన శ్రీకృష్ణ, దుర్గాసి దర్మారావు, బెందాళం శోభన్‌బాబు, కొనపల సురేష్‌, గుమ్మడి రాందాస్‌, నర్తు ప్రేమ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement