వేతనం తూచ్‌..! | - | Sakshi
Sakshi News home page

వేతనం తూచ్‌..!

Sep 8 2025 5:04 AM | Updated on Sep 8 2025 5:04 AM

వేతనం

వేతనం తూచ్‌..!

కూటమి ప్రభుత్వంలో ఫ్యాకల్టీకి జీతాల్లేవు ప్రభుత్వానికి బిల్లులు పెట్టాం

● సేవలకు ‘స్కోచ్‌’

ఆంధ్రా, తెలంగాణలో పలు పోటీ పరీక్షలకు తెలుగు, ఎకనామిక్స్‌ సబ్జెక్ట్‌లు బోధించడం జరిగింది. బీసీ స్టడీ సర్కిల్స్‌లో గత పదేళ్లుగా ఎకనామిక్స్‌తో పాటు తెలుగు సబ్జెక్ట్‌లో బోధిస్తూ వస్తున్నాం. ఇప్పటివరకు ఎప్పుడూ జీతాల సమస్య లేదు. గ్రూప్‌–2, డీఎస్సీ శిక్షణ రెమ్యునరేషన్‌ మాత్రమే జాప్యమవుతూ వచ్చింది. గ్రూప్‌–2కు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ప్రిలిమినరీ శిక్షణా రెమ్యునరేషన్‌ విడుదలైంది. ఈ ప్రభుత్వం వచ్చాక మెయిన్స్‌కు సంబంధించి జీతాలు విడుదల చేయలేదు. అలాగే, డీఎస్సీ శిక్షణకు సంబంధించి కూడా జీతాలు రాలేదు. స్కోచ్‌ అవార్డు రావడం సంతోషమే. కానీ, జీతాలు రాకపోతే ఆ ఆనందం కడుపు నింపదు.

– జి.రాంబాబు, బీసీ స్టడీ సర్కిల్‌ ఫ్యాకల్టీ

జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిన ఫ్యాకల్టీ జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి బిల్లులు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే చెల్లింపులు చేస్తాం. బోధించిన ఫ్యాకల్టీకి తప్పకుండా జీతాలు వస్తాయి. – ఇ.అనురాధ, జిల్లా వెనకబడిన

తరగతుల సంక్షేమ అధికారి, శ్రీకాకుళం.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

గ్రూప్‌–2, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ అందించింది బీసీ స్టడీ సర్కిల్‌. ఈ శిక్షణతో అనేక మంది అభ్యర్థులు మంచి ఫలితాలు సాధించగా, ఆ విజయానికి గుర్తింపుగా బీసీ స్టడీ సర్కిల్‌ సేవలకు గాను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖకు తాజాగా స్కోచ్‌ అవార్డు లభించింది. ఫ్యాకల్టీ సభ్యులు శ్రమించి, విద్యార్థులను విజయం వైపు నడిపించా రు. అయితే ఈ విజయానికి బలమైన పునాది వేసిన ఫ్యాకల్టీ సభ్యులు మాత్రం నిరాశలో మునిగిపోయారు. నెలల తరబడి బోధించినా ఇప్పటికీ వా రికి జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కష్టానికి అవార్డు రావడం తమకు గర్వకారణమే గానీ ఆ అవార్డు కడుపు నింపదని వాపోతున్నారు.

270 మంది ఫ్యాకల్టీకి జీతాల్లేవు..

15 నెలల క్రితం గ్రూప్‌–2 మెయిన్స్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్‌ ద్వారా 70 మంది ఫ్యాకల్టీతో అభ్యర్థులకు శిక్షణ ఇప్పించింది. ఒక్కో పీరియడ్‌కి రూ.1000 చొప్పున ఇస్తామని చెప్పింది. దీంతో ఫ్యాకల్టీ అభ్యర్థులకు బోధించడం జరిగింది. వారికి ఇంతవరకు రెమ్యునరేషన్‌ ఇవ్వలే దు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సర్కిల్స్‌ ద్వారా 200 మంది ఫ్యాకల్టీ ద్వారా 10 నెలల కిందట డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఒక్కో పీరియడ్‌కి రూ. 600 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు వారికి జీతాలు విడుదల చేయలేదు.

ఫ్యాకల్టీని విస్మరించిన ప్రభుత్వం

ప్రతిభకు గుర్తింపుగా ఇటీవల బీసీ స్టడీ సర్కిల్‌కు స్కోచ్‌ అవార్డు లభించింది. ఇది సంస్థ ప్రతిష్టను పెంచింది. కానీ స్కోచ్‌ అవార్డు రావడానికి మూల కారణమైన ఫ్యాకల్టీ సభ్యులు మాత్రం బకాయి వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి బోధించినా ఇప్పటివరకు వారికి జీతాలు అందలే దు. ఉపాధ్యాయులకు వేతనం ఇవ్వకపోతే అది వారిలో విశ్వాసం దెబ్బ తీయడమే అవుతుందని వాపోతున్నారు. మొత్తానికి విద్యార్థుల విజయాల కు గుర్తింపు వచ్చింది. కానీ బోధించిన ఉపాధ్యాయులకు బకాయి వేతనాలే మిగిలాయి.

బీసీ స్టడీ సర్కిల్‌ సేవలకు స్కోచ్‌ అవార్డు

వేతనం కోసం ఎదురు చూపుల్లో ఫ్యాకల్టీ

స్కోచ్‌ అవార్డు తెచ్చిన స్టడీ సర్కిల్‌ ఫ్యాకల్టీకి తీవ్ర నిరాశ

అవార్డు ప్రభుత్వానికి ప్రతిష్ట

ఫ్యాకల్టీకి మాత్రం ఆర్థిక కష్టాలు

వేతనం తూచ్‌..!1
1/1

వేతనం తూచ్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement