
ఆర్ట్స్ కాలేజీ టు ఐఎన్‌ఎస్‌ఏ..
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్‌ఎస్‌ఏ) విజిటింగ్ సైంటిస్ట్‌గా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అప్లయ్‌డ్ సైన్సెస్ హెచ్‌ఓడీ డాక్టర్ మదమంచి ప్రదీప్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఐఎన్‌ఎస్‌ఏ నుంచి వర్తమానం అందుకున్నారు. న్యూఢిల్లీకి చెందిన ఐఎన్‌ఎస్‌ఏ ఏటా కొందరు శాస్త్రవేత్తలు, అధ్యాపకులను దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలైనా ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, నిట్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో కలిసి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. ప్రతిభ అధారంగా విజిటింగ్ సైంటిస్టులను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 70 మంది శాస్త్రవేత్తలు, లెక్చరర్లను ఐఎన్‌ఎస్‌ఏ ఎంపికచేయగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు లభించింది. ఆ జాబితాలో ఆర్ట్స్ కళాశాలకు చెందిన అప్లయిడ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ ప్రదీప్ ఒకరు. ఈయనతో పాటు మైలవరంలోని బోటనీ లెక్చరర్ జి.రాముడుకు అవకాశం లభించింది. తిరుపతిలో ప్రఖ్యాత విద్యాసంస్థ ఐఐఎస్‌ఈఆర్ వేదికగా నెలరోజుల పాటు పరిశోధన కార్యకలాపాలలో ప్రదీప్ భాగస్వామ్యం కానున్నారు.
ప్రదీప్ సారథ్యంలో..
ఇండియన్ అకానమీ ఆఫ్ సైన్సెస్ రిఫ్రెషర్ కోర్సులను 2021, 2022 రెండు సంవత్సరాల్లో నిర్వహించారు. 50 మంది లెక్చరర్లకు కెరీర్ అడ్వాన్స్‌మ్మెంట్ స్కీమ్ (సీఏఎస్)లను అమలుపర్చగలిగారు. సెర్బ్ యాగ్జిలిలేటెడ్ విజ్ఞాన్ పథకంలో భాగంగా ఏడు రోజులపాటు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రొగ్రాంలు నిర్వహించారు. డీబీటీ సౌజ్యంతో ఎన్నో సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు, సైన్స్, అకాడమీల లెక్చరర్ల రీఫ్రీసెస్, డీఎస్టీ ఇన్‌స్పైర్ క్యాంప్స్, సైన్స్ ఎగ్జిబిషన్లు తదితర యాక్టివిటీలను నిర్వహించారు. కళాశాలకు ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీ కోర్సు మంజూరయ్యేలా చేశారు. యూజీసీ–ఎన్‌ఎస్‌క్యూఎఫ్ ద్వారా ఆక్వా కల్చర్‌పై మూడు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు నిర్వహించారు. పీసీఆర్ టెస్టులపై వర్క్‌షాప్, సర్టిఫికెట్ కోర్సులను అందించారు. డీబీటీ, యూజీసీ, సెర్బ్, రూసా రీసెర్చ్ ప్రాజెక్టులు చేశారు. యూజీ, పీజీ బయోటెక్నాలజీ విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వివిధ కంపెనీలు, లేబరేటరీలు, హాస్పిటల్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. మరో ఏడు ఇండియన్ పేటెంట్స్, ఒక జర్మన్ పేటెంట్‌ను అందుకున్నారు. ఆరు బెక్‌చాప్టర్స్, స్కోపస్‌లో ఇండెక్స్‌లో నమోదైన 15 అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను ప్రచురించారు. తాజాగా 9,10, ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను పరిశోధనలవైపు ఆకర్షితులను చేసేందుకు ‘ప్రయాస్’ పేరిట ప్రత్యేక పథకాన్ని కొనసాగిస్తున్నారు. వీటిన్నింటిని ఆధారంగా చేసుకుని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్‌ఎస్‌ఏ) విజిటింగ్ సైంటిస్ట్‌గా ఎంపికచేశారు. 2022లో సెప్టెంబర్ 5న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు సైతం అందుకున్నారు. ఈయన స్వస్థలం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయ గ్రామం. ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలోని విశాఖ–బి కాలనీలో నివాసముంటున్నారు. తల్లిదండ్రులు నరసింహ, ప్రమీల.
కళాశాలలో నిర్విరామంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు, రిసోర్స్‌ప్రొగ్రాంలు, ఓరియంటేషన్ కార్యక్రమాలతో విద్యార్థుల ఉన్నతికి, వారి సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్న డాక్టర్ ప్రదీప్ కళాశాలకు గర్వకారణంగా నిలుస్తున్నారు. కళాశాలకు ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీ కోర్సు కేటాయింపులో విశేష కృషి చేశారు.
–డాక్టర్ శ్రీరాములు, ప్రిన్సిపాల్, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పురుషులు)
విజిటింగ్ సైంటిస్ట్ పథకం ద్వారా పరిశోధన సామర్థ్యం ఉన్నప్పటికీ అందుకు తగిన అవకాశాలు లేని అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పరిశోధన చేయటానికి వీలుపడుతుంది. కార్యక్రమంలో భాగంగా ఔషధ నిరోధక మూర్ఛరోగాలలో జీవ అణు అధ్యయనాలను రీసెర్చ్ చేయనున్నాం. దేశ్యాప్తంగా 70 మంది శాస్త్రవేత్తలు, లెక్చరర్ల జాబితాలో చోటులభించినందుకు సంతోషంగా ఉంది.
– డాక్టర్ ప్రదీప్, హెచ్‌ఓడీ
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ విజిటింగ్ సైంటిస్ట్‌గా డాక్టర్ ప్రదీప్
దేశవ్యాప్తంగా ఎంపికై న శాస్త్రవేత్తలు, లెక్చరర్ల జాబితాలో చోటు
జిల్లా నుంచి ఎంపికై న మొదటి వ్యక్తిగా గుర్తింపు

ఆర్ట్స్ కాలేజీ టు ఐఎన్‌ఎస్‌ఏ..

ఆర్ట్స్ కాలేజీ టు ఐఎన్‌ఎస్‌ఏ..