
జీవనాధారం కూల్చేశారు
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఎంతో మంది ఫుట్‌పాత్ వ్యాపారులకు ఆసరాగా ఉన్న మహాత్మాగాంధీ కూరగాయల కాంప్లెక్స్‌ను ఆదివారం కూల్చేశారు. రోడ్డు పక్కన చిన్నపాటి వ్యాపారాల్లో భాగంగా అరటిపళ్లు, ఇతర కూరగాయలు అమ్మకాలు చేసుకునే వారి కోసం 23 ఏళ్ల క్రితం అప్పటి సర్పంచ్ టంకాల పావనిరాణి నేతృత్వంలో ఈ కాంప్లెక్స్ నిర్మాణం చేశారు. అప్పటి నుంచి ఎంతో మంది వీధి విక్రయదారులకు ఈ కాంప్లెక్స్ ఆసరాగా నిలిచింది. ఇప్పుడు దీనిని కూల్చివేయడంతో చిరువ్యాపారులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది.