
లగేజీ ఆటో ఢీకొని వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: బెండి గేట్–కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో సరియాపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన కర్ని వెంకటరమణ (36) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. వెంకటరమణ పలాస మండలం పెదమాకన్నపల్లిలో ఉన్న అత్తారింటికి వెళ్లి బెండి గేట్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వెళ్తున్న లగేజీ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడి ఎడమ చేయి విరిగిపోగా, తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని 108 వాహనంలో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణ గల్ఫ్‌లో వెల్డర్‌గా పని చేస్తూ ఆరు నెలల కిందటే ఇంటికి వచ్చాడు. భార్య ద్రాక్షవేణి, కుమారుడు లక్కీ, కుమార్తె ప్రక్షత, తల్లి రాజేశ్వరి ఉన్నారు. వెంకటరమణ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.